కరీనా స్థానంలోకి కంగనా రనౌత్​

By udayam on September 14th / 11:26 am IST

బాలీవుడ్​ భారీ బడ్జెట్​ మూవీ ‘ది ఇంకర్నేషన్​–సీత’ లో లీడ్​ రోల్​కు కంగనా రనౌత్​ ఎంపికైంది. ఈ విషమాన్ని ఆ చిత్ర నిర్మాతలు, డైరెక్టర్​ కూడా కన్ఫర్మ్​ చేశారు. అంతకు ముందు ఈ సినిమాలో సీత పాత్రకు కరీనా కపూర్​ను తీసుకుంటారని, అందుకు ఆమెకు రూ.12 కోట్ల వరకూ పారితోషికం ఇస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే బడ్జెట్​ పెరిగిపోతున్నందునే ఆ పాత్ర కోసం కంగనాను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథ రాసిన విజయేంద్ర ప్రసాద్​ సైతం కంగనా నే సీత క్యారెక్టర్​కు బెస్ట్​ అని సూచించారట.

ట్యాగ్స్​