శ్వాస ఇబ్బందులతో ఆసుపత్రికి ఉపేంద్ర

By udayam on November 25th / 7:26 am IST

కన్నడ అగ్ర నటుడు, డైరెక్టర్​ ఉపేంద్ర శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొంటూ ఆసుపత్రిలో చేరాడు. బెంగళూరు కు వెళ్తున్న క్రమంలో అతడి ఆరోగ్యం దెబ్బతినడంతో ఆయనను నీలమంగల లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. డస్ట్​ ఎలర్జీ వల్లనే అతడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైనట్లు తెలుస్తోంది. 53 ఏళ్ళ ఉపేంద్రకు అక్కడి వైద్యులు చికిత్స చేసిన అనంతరం గురువారమే డిశ్చార్జ్​ చేసేశారు. ప్రస్తుతం అతడు యుఐ అనే సినిమాలో నటిస్తున్నాడు.

ట్యాగ్స్​