కన్నడ సీనియర్ నటి అభినయకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది. కట్నం కోసం వదినను వేధించిన కేసులో అభినయను దోషిగా తేల్చిన న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష విధించగా, ఆమె సోదరుడు శ్రీనివాస్‌కు మూడు సంవత్సరాలు, ఆమె తల్లి జయమ్మకు ఐదేళ్లు, మరో సోదరుడు చెలువరాజుకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.అదనంగా మరో లక్ష రూపాయల కట్నం తీసుకురావాలంటూ అభినయ తన మరదలు లక్ష్మీదేవిని వేధిస్తోందని 2002 లో చంద్రా లే అవుట్ పిఎస్ లో కేసు నమోదైంది.