కన్నడ నటి చేతన రాజ్ బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆమె ఫ్యాట్ ఫ్రీ ప్లాస్టిక్ సర్జరీ కోసం షెట్టీస్ కాస్మెటిక్ సెంటర్లో చికిత్సకు జాయిన్ అయ్యారు. ఈ చికిత్స కోసం ఎక్కించిన ఫ్లూయిడ్ ఆమె ఊపిరితిత్తుల్లోకి చేరుకోవడంతో ఆమె సోమవారం కన్నుమూశారు. ఆమె తల్లిదండ్రులకు ఈమెకు జరిగిన సర్జరీపై ఎలాంటి సమాచారం లేదని పోలీసులు తెలిపారు. 21 ఏళ్ళ నటి మృతిపై తల్లిదండ్రులు ఆసుపత్రి యాజమాన్యం పై కేసు నమోదు చేశారు.