వైరల్​ వీడియో : నేను గుట్కా తినలేదు

By udayam on November 27th / 3:09 pm IST

కాన్పూర్​ వేదికగా భారత్​, న్యూజిలాండ్​ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్​ మ్యాచ్​లో తొలిరోజు స్టాండ్స్​లో గుట్కా నములుతూ వైరల్​ అయిన కాన్పూర్​ వ్యక్తి ఆ ఘటనపై స్పందించాడు. తాను గుట్కా ఎప్పుడూ తినలేదని, ఆరోజు నేను ఉసిరికాయను చప్పరిస్తున్నానని అతడు ఎఎన్​ఐ వార్తా సంస్థతో అన్నాడు. తిరిగి మ్యాచ్​ను చూడడానికి స్టేడియానికి వచ్చిన అతడు ‘గుట్కా ఆరోగ్యానికి ప్రమాదకరం’ అనే బ్యానర్​ను కూడా చేతబట్టుకుని తనపై జరుగుతున్న ప్రచారానికి ఫుల్​స్టాప్​ పెట్టాలని కోరాడు.

ట్యాగ్స్​