రూ.400 కోట్ల క్లబ్​ లోకి కాంతార

By udayam on November 22nd / 9:25 am IST

కన్నడ లేటెస్ట్​ పాన్​ ఇండియా బ్లాక్​ బస్టర్​ కాంతార రూ.400 కోట్ల కలెక్షన్స్​ క్లబ్​ లోకి చేరింది. సెప్టెంబర్​ 30న కన్నడలోనూ.. ఆ తర్వాత పలు భాషల్లోనూ విడుదలైన ఈ రిషబ్​ శెట్టి మూవీకి కర్ణాటకలో ఏకంగా రూ.168.50 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ క్రమంలో ఈ మూవీ అక్కడ కెజిఎఫ్​2 రికార్డులను సైతం బ్రేక్​ చేసింది. ఆంధ్ర, తెలంగాణల్లో రూ.60 కోట్లు, తమిళనాడులో రూ.12.70 కోట్లు, కేరళలో రూ.19.20 కోట్లు, ఓవర్సీస్​ లో రూ.44.50 కోట్లు, ఉత్తర భారతంలో రూ.96 కోట్లు వచ్చాయి. మొత్తంగా రూ.400.90 కోట్ల వసూళ్ళు దక్కించుకుంది.

ట్యాగ్స్​