రేపటి నుంచి ఓటిటిలోకి కాంతార

By udayam on November 23rd / 11:58 am IST

రిషబ్ షెట్టి హీరోగా, డైరెక్టర్ గా తెరకెక్కించిన రీసెంట్ బాక్సాఫీస్ బ్లాక్ బాస్టర్ కాంతార సినిమా ఓటీటీ డేట్​ లాక్​ అయింది. రేపటి నుంచే (నవంబర్​ 24) నుంచి ఈ మూవీని అమెజాన్​ ప్రైమ్​ లో స్ట్రీమింగ్​ చేయనున్నారు. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్​ కానుంది. కేవలం రూ.16 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించి ఏకంగా రూ.400 కోట్లను కొల్లగొట్టింది.కర్ణాటక తుళునాడు సంస్కృతి, భూతకోల సంప్రదాయం కళ్లకు కట్టిన ఈ చిత్రానికి హీరో రిషబ్​ షెట్టి నే డైరెక్టర్​ కూడా.

ట్యాగ్స్​