పైప్​లైన్​లో డబ్బు కట్టలు

By udayam on November 25th / 4:58 am IST

అవినీతి అధికారులు తాము సంపాదించిన డబ్బును దాచుకోవడానికి కొత్త దారులు వెతుకుతున్నారు. తాజాగా బెంగళూరులోని ఓ పీడబ్ల్యుడీ జాయింట్​ ఇంజనీర్​ ఇంట్లో ఏసీబీ దాడులు నిర్వహించి అతడి ఇంట్లోని కుళాయి గొట్టాల్లో డబ్బు కట్టల్ని గుర్తించింది. దీంతో ఓ ప్లంబర్​ను తీసుకొచ్చి ఆ గొట్టాల్లో దాగి ఉన్న డబ్బును వెలికి తీయించింది. ఈ తతంగం మొత్తాన్ని వీడియో తీయించిన ఏసీబీ పైప్​ లైన్​ నుంచి కరెన్సీ నోట్లు కిందకు పడడం చూసి అధికారులు అవాక్కయ్యారు. 4 కోట్లు విలువైన నగలు కూడా అతడి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్​