కర్ణాటక: బిఎఫ్​7 వేరియంట్​ రోగులకు ఉచిత వైద్యం

By udayam on December 27th / 8:58 am IST

దేశంలో కరోనా ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ బీఎఫ్‌ 7 కలవరం రేపుతోన్న వేళ … కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యాధి సోకిన రోగులకు పైసా ఖర్చు లేకుండా మెరుగైన వైద్యం అందించనున్నట్లు రెవెన్యూ మంత్రి ఆర్‌.ఆశోక అధికారిక ప్రకటన చేశారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో మాస్క్​ తప్పనిసరి చేసిన ప్రభ/త్వం.. బిఎఫ్​7 వేరియంట్​ సోకిన బాధితుల కోసం ప్రత్యేక ఆసుపత్రులను కూడా ఏర్పాటు చేస్తోంది. బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్‌, మంగళూరులోని వెన్‌లాక్‌ హాస్పిటల్‌లో చికిత్స అందించనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్​