ఆక్సిజన్​ అందక 24 మంది మృతి

By udayam on May 3rd / 8:11 am IST

కర్ణాటకలోని చామరాజనగర్​ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్​ అందక కేవలం 2 గంటల వ్యవధిలో 24 మంది పేషెంట్లు మరణించారు. ఆదివారం రాత్రి 12 నుంచి 2 గంటల మధ్యలో సంభవించిన ఈ మరణాలకు ఆక్సిజన్​ కొరతే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో 144 మంది పేషెంట్లు చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘటనపై సిఎం యడియూరప్ప విచారణకు ఆదేశించారు. ఈ ఆసుపత్రికి అందాల్సిన ఆక్సిజన్​ కోటా సకాలంలో అందడంతో పాటు అదనంగా 15 ఆక్సిజన్​ సిలిండర్లు సిద్ధంగా ఉన్నా ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమని సిఎం వివరించారు.

ట్యాగ్స్​