కర్ణాటక-మహారాష్ట్ర వివాదం : బెలగావిలో 5 వేల మంది పోలీసుల పహారా

By udayam on December 20th / 4:29 am IST

మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దులో మరో సారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బెలగావిలోని విధాన సౌధలో సోమవారం నుండి కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీంతో నిరసన తెలిపేందుకు అక్కడికి చేరుకున్న ప్రతిపక్ష నేతలను పోలీసులు అడ్డుకున్నారు. చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు. బెలగావి నగరంలోనే సుమారు 5వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్‌ విధించారు. బెలగావిని మహారాష్ట్రలో విలీనం చేయాలంటూ మహారాష్ట్ర ఏకీకరణ్‌ సమితి (ఎంఇస్‌) ఐదు దశాబ్దాలుగా డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​