సర్దార్, పొన్నియన్ సెల్వన్ వంటి 2 బ్లాక్ బస్టర్లను గతేడాది ఖాతాలో వేసుకున్న కార్తీ తన కొత్త చిత్రం జపాన్ తోనూ సంచనాలు సృష్టించేలానే ఉన్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ మూవీ పోస్ట్ ధియేట్రికల్ ఓటిటి రైట్స్ ను భారీ మొత్తానికి నెట్ ఫ్లిక్స్ సంపాదించింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ తెరకెక్కనుంది. అయితే ఎంత మొత్తానికి ఈ డీల్ జరిగింది అన్నది ఇంకా బయటకు రాలేదు. ఈ మూవీకి రాజు మురుగన్ డైరెక్టర్ కాగా.. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్.