తన హీరో షెహజాదా రిలీజ్ సమయంలోనే అలా వైకుంఠపురం హిందీ వర్షన్‌ను రిలీజ్ చేస్తారన్న వార్తలపై బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ఈ విషయాన్ని షెహజాదా ప్రొడ్యూసర్ మనీష్ షా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. ‘బన్నీ అలా వైకుంఠపురములో సినిమానే మేం హిందీలో షెహజాదాగా రీమేక్ చేశాం. అదే సమయంలో తెలుగు వర్షన్‌ను డబ్ చేసి రిలీజ్ చేస్తామంటున్నారు. దీనిపై ఆర్యన్ చాలా కోపంగా ఉన్నాడు’ అని ప్రొడ్యూసర్ చెప్పుకొచ్చాడు.