టివి నటిని కాల్చిచంపిన టెర్రరిస్టులు

By udayam on May 26th / 3:49 am IST

జమ్మూ కశ్మీర్​లో మిలిటెంట్లు మళ్ళీ రెచ్చిపోయారు. బుడ్గాంలో ఉంటున్న టివి ఆర్టిస్ట్​ అమ్రీన్​ భట్​ (35)ను కాల్చి చంపారు. కాల్పుల్లో గాయపడ్డ ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించారు. ఈ ఘటనలో ఆమెతోనే ఉన్న ఆమె మేనల్లుడు సైతం గాయపడ్డాడు. ఆమె ఇంట్లోకి చొరబడి మరీ కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. లష్కరే–ఈ–తోయిబా సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడ్డట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

ట్యాగ్స్​