తెరుచుకున్న కేదార్​నాథ్​ ఆలయం

By udayam on May 6th / 4:56 am IST

హిందువులకు అత్యంత పవిత్రమైన కేదార్​నాథ్​ దేవాలయం తిరిగి నేటి నుంచి తెరుచుకుంది. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్​ సిఎం పుష్కర్​ సింగ్​ ధామీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో కేదార్​నాథ్​ ఒకటి. ఏటా వేలాది మంది భక్తులు ఈ ఆలయన దర్శనం కోసం తరలి వస్తుంటారు. వేసవిలో భక్తుల కోసం తెరుచుకునే ఈ ఆలయం శీతాకాలం నుంచి 6 నెలల పాటు మూతబడుతుంది. మందాకినీ నది ఒడ్డున ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు నిర్మించారు.

ట్యాగ్స్​