కేరళలోని శబరిమల దేవాలయంలో ‘అరవణం’ ప్రసాదం పంపిణీని వెంటనే నిలిపివేయాలంటూ ఆ రాష్ట్ర హై కోర్టు ఆదేశించింది. ప్రసాదంలో వాడే యాలకుల్లో పురుగుమందు అవశేషాలు ఉన్నట్లుగా గుర్తించడంతో ప్రసాదం పంపిణీని వెంటనే ఆపాలని కోర్టు తన తీర్పులో తెలిపింది. ప్రసాదంలో వాడిన యాలకుల్లో 14 రకాల హానికారక అవశేషాలు ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. బిడ్లు పిలవకుండా, పత్రికల్లో ప్రకటనలు ఇవ్వకుండా ఏకపక్షంగా స్థానిక వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చారని… వాళ్లు సరఫరా చేసే యాలకుల నాణ్యతను పరిశీలించాలని అయ్యప్ప స్పైసెస్ కోర్టును కోరింది.