కేరళలో వర్షాలకు 24 మంది మృతి

By udayam on October 18th / 5:29 am IST

కేరళలో కురుస్తున్న భారీ వర్షాల ధాటికి మరణించిన వారి సంఖ్య 24కు చేరుకుంది. ఆ రాష్ట్రంలోని మొత్తం 11 జిల్లాల్లో ఎల్లో అలెర్ట్​ను ప్రకటించారు. కుంభవృష్టి కురవడంతోనే ఈ రాష్ట్రంలో హఠాత్తుగా వరదలు వచ్చిపడ్డాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొట్టాయం, ఇడుక్కు జిల్లాలు ఈ వర్షాలకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కొట్టాయంలోని నది ఒడ్డున ఉన్న ఓ బిల్డింగ్​ వరదల్లో కొట్టుకుపోయిన వీడియో వైరల్​ అవుతోంది. ఆ రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కొండచరియలు విరిగిపడి రహదారులు బంద్​ అయ్యాయి.

ట్యాగ్స్​