కేరళలో ‘టమాటా ఫీవర్​’

By udayam on May 10th / 10:39 am IST

కేరళలోని టమాటా ఫీవర్​ వ్యాపిస్తోంది. ఇప్పటికే 82 మంది చిన్నారుల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి. వీరంతా 5 ఏళ్ళ లోపు వారేనని వైద్యులు తెలిపారు. టొమాటో ఫ్లూ గా పిలిచే ఈ వైరల్​ ఇన్​ఫెక్షన్​పై అక్కడి ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. కేరళలోని కొల్లాం, అర్యనకావు, అంచల్​, నెడువత్తూరుల్లోనూ ఈ ఇన్ఫెక్షన్​ కేసుల జాడ బయటపడింది. హై ఫీవర్​, శరీరంపై మచ్చలు, జాయింట్​ స్వెల్లింగ్​, దురదలు ఉంటే వెంటనే చిన్నారులను ఆసుపత్రికి తీసుకెళ్ళాలని సూచించింది.

ట్యాగ్స్​