దుబాయ్​ వెళ్ళి మరీ ఐఫోన్​ కొన్న పిచ్చోడు

By udayam on September 20th / 6:16 am IST

ఐఫోన్​ పిచ్చోళ్ళు వేసే వేషాలు మామూలుగా ఉండవ్​. ఇటీవల యాపిల్​ విడుదల చేసిన ఐఫోన్​ 14 సిరీస్​ను కొనుగోలు చేయడానికి కేరళకు చెందిన ఓ వ్యక్తి దుబాయ్​కు వెళ్ళి దానిని సొంతం చేసుకున్నాడు. మంగళవారం భారత్​లో రిలీజ్​ అవుతున్న ఈ ఫోన్​ను భారతీయులందరి కంటే ముందే కొనుగోలు చేయాలన్న పిచ్చితో అతడు దుబాయ్​కు రూ.40 వేలు (రాను పోను) టికెట్​ ఛార్జీలు పెట్టుకుని మరీ వెళ్ళొచ్చాడు. అక్కడ అతడు కొన్న ఫోన్​ ఖరీదు రూ.1,29,000 లు కాగా.. టికెట్​ ఛార్జీలు కలుపుకుంటే రూ.1,69,000 అయింది. అదే ఫోన్​ భారత్​లో రూ.1,59,000లకు మంగళవారం నుంచి అందుబాటులో ఉంది.

ట్యాగ్స్​