కన్నడ సెన్సేషనల్ హిట్ కెజిఎఫ్ ఛాప్టర్ 2 ఓటిటి స్ట్రీమింగ్ రైట్స్‌కు కళ్ళు చెదిరే రేటు పలికింది. ఏకంగా రూ.320 కోట్లకు ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ అమ్ముడుపోయాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటి ప్లాట్‌ఫామ్ ఈ 1000 కోట్ల మూవీ కోసం ఈ భారీ మొత్తాన్ని చెల్లించి కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల రైట్స్‌ను సొంతం చేసుకుంది. మే 27 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. యష్, ప్రశాంత్ నీల్, సంజయ్ దత్‌లు నటించిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ అయిన విషయం తెలిసిందే.