దంగల్​ను దాటేసిన కెజిఎఫ్​2

By udayam on May 6th / 6:25 am IST

రికార్డుల్ని తిరగరాస్తున్న యష్​, ప్రశాంత్​ నీల్​ల యాక్షన్​ ఎంటర్​ టైనర్​ కెజిఎఫ్​ ఛాప్టర్​ 2 హిందీ బాక్సాఫీస్​పై దండయాత్ర కొనసాగుతోంది. తాజాగా హిందీలో 2వ అత్యదిక కలెక్షన్లు సాధించిన మూవీగా రికార్డులకెక్కింది. ఇప్పటి వరకూ ఈ ప్లేస్​లో ఉన్న అమీర్​ఖాన్​ దంగల్​ మూవీని క్రాస్​ ఈ మూవీ క్రాస్​ చేసేసింది. దంగల్​ హిందీలో రూ.387.38 కోట్లు కొల్లగొడితే.. కెజిఎఫ్​ ఛాప్టర్​ 2 గురువారం నాటికి రూ.391.65 కోట్లు సాధించింది. బాహుబలి 2వ పార్ట్​ అందరికంటే ముందు ఉంది.

ట్యాగ్స్​