కెజిఎఫ్ ఛాప్టర్ 1, ఛాప్టర్ 2 లతో పాన్ ఇండియా స్టార్లుగా మారిన ప్రశాంత్ నీల్, యశ్‌లు ఈ సిరీస్‌లో మరో పార్ట్ ఉంటుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఈ మూవీ ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశాలు లేవని కొయిమోయి రిపోర్ట్ చేసింది. ఛాప్టర్ 3 కోసం 2025 వరకూ అభిమానులు వెయిట్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్‌తో ఆపై ఎన్టీఆర్‌తో సినిమాలకు కమిట్ అవ్వగా.. యశ్ సైతం కన్నడ డైరెక్టర్ నార్తన్ డైరక్షన్లో సినిమాకు సిద్ధమవుతున్నాడు.