గతేడాది ఎఫ్–3 తో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్న విక్టరీ వెంకటేష్.. తాజాగా హిట్ ఫ్రాంచైజ్ డైరెక్టర్ శైలేష్ కొలనుతో కొత్త సినిమాను మొదలెట్టనున్నారు. ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. కేజీఎఫ్ పాన్ ఇండియా హీరోయిన్ గా మారిన కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి.. ఈసారి వెంకటేష్ తో జోడీ కట్టనుంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా నిర్మాణం జరుగుతోంది. ఇంకా షూటింగ్ మొదలు కాని ఈ మూవీపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.