ఇంజెక్షన్​ హత్య.. వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడనే

By udayam on September 21st / 7:09 am IST

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఇంజెక్షన్​ హత్య కేసును పోలీసులు ఛేధించారు. మృతుడు జమాల్​సాహెబ్​ భార్య ఇమామ్​ బీ నే తన ప్రియుడితో కలిసి ఈ హత్య చేయించిందని పోలీసులు ఈ కేసు వివరాలు వెల్లడించారు. సోమవారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని బాణాపురంలో పని మీద బైకుపై జమాల్ సాహెబ్​ వెళ్తుండగా.. ఓ గుర్తు తెలియని వ్యక్తి రోడ్డుపై ఆపాడు. ఐతే మార్గం మధ్యలో జమాల్ సాహెబ్​ కు హెవీ డోస్​ మత్తు మందును ఇంజెక్షన్‌ చేశాడు. దీంతో వెంటనే జమాల్ సాహెబ్​ స్పృహ తప్పి, కింద పడి మరణించాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు రెండు రోజుల్లో కేసును ఛేదించారు. మోహన్‌రావు, వెంకటేశ్, వెంకట్‌, జమాల్ భార్య ఇమామ్‌బీ లను అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్​