దక్షిణ కొరియా కార్ల కంపెనీ కియా పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కార్ EV6 ని భారత్‌లో జూన్ 2న లాంచ్ చేస్తోంది. ఈనెల 26 నుంచి ఈ కారు బుకింగ్స్‌ను ప్రారంభిస్తున్నట్లు చెప్పిన కియా సంస్థ దేశంలో ముందుగా 100 యూనిట్లను మాత్రమే అమ్మకానికి ఉంచింది. 77.4 కి.వాట్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తున్న ఈ కారులో 225బిహెచ్పి పవర్ ఉంటుంది. ఫుల్ ఛార్జ్ చేస్తే 528 కి.మీ.ల రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. 800 వాట్ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.