కొరియా కార్ల కంపెనీ కియా మోటార్స్ భారత్‌లో ఈవీ 6 కార్‌ను తీసుకొచ్చింది. రెండు వర్షన్లలో వస్తున్న ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ.60 లక్షలుగా పేర్కొంది. విశాలమైన క్యాబిన్ ఉన్న ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 528 కి.మీ.ల రేంజ్ ఇస్తుంది. ఇప్పటికే ప్రపంచ మార్కెట్లో విడుదలై సూపర్ హిట్ కొట్టిన ఈ మోడల్‌ను భారత్‌లో ముందుగా 100 యూనిట్లను మాత్రమే తీసుకొస్తున్నట్లు పేర్కొంది. దీనికి వచ్చిన ఆదరణను బట్టి వీటి సేల్స్ పెంచనుంది.