హవాయి: బద్దలైన కిలాయుయా అగ్నిపర్వతం

By udayam on January 9th / 6:23 am IST

కిలాయుయా అగ్నిపర్వతం మళ్లీ బద్ధలైంది. జనవరి 5 నుండి ఈ అగ్నిపర్వతం బద్ధలవుతూనే ఉంది. గత నవంబర్‌ లో దీనికి సమీపంలోనే ఉన్న ‘మౌనాలోవా’ అగ్ని పర్వతం పేలిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘కిలాయుయా’ అగ్నిపర్వతం నుంచి లావా ఎగిసిపడుతోంది. భూమిపై ప్రస్తుతం అత్యంత చురుకుగా ఉన్న అగ్నిపర్వాతాల్లో కిలాయుయా ఒకటి. ప్రపంచంలోనే హవాయిలో అత్యధికంగా క్రియాశీల అగ్ని పర్వతాలు ఉన్నాయి. మొత్తం 6 అగ్ని పర్వతాలు ఈ ప్రాంతంలో చురుకుగా ఉన్నాయి. ఇక్కడ ఒక్కో దీవి ఒక్కో అగ్నిపర్వతాన్ని కలిగి ఉంది. భూమి ఏర్పడిన తర్వాత 70 మిలియన్‌ సంవత్సరాల నుంచి ఈ అగ్నిపర్వతాలు క్రియాశీలకంగా ఉంటున్నాయి.

ట్యాగ్స్​