నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తనకు అత్యంత ఆప్తుడు, నమ్మకస్తుడు అయిన ఆర్మీ మార్షల్ హ్యోన్ చొల్ హయే మరణంతో కుమిలిపోతున్నాడు. చోల్ హయే అంత్యక్రియల్లో స్వయంగా పాల్గొన్న ఆయన తన రాజకీయ గురువు శవ పేటికను సైతం మోశారు. మాస్క్ కూడా లేకుండా ఆయన బయటకు వచ్చిన ఆయన హ్యోన్ చొల్ హయేకు ఘన నివాళులర్పించారు. 2011లో తన తండ్రి కిమ్ జోంగ్–2 మరణం తర్వాత కిమ్‌ను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టడంలో చొల్ హయే కీలక పాత్ర పోషించాడు.