బుల్లితెర కమెడియన్ కిరాక్ ఆర్పీ పెళ్ళి పీటలెక్కనున్నాడు. చాలా కాలం నుంచి అతడు ప్రేమిస్తున్న లక్ష్మీ ప్రసన్నను నిశ్చితార్ధం చేసుకున్నాడు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆర్పీ నిశ్చితార్ధానికి జబర్దస్త్ నటుడు ధనరాజ్ కుటుంబంతో పాటు పలువురు టివి నటులు, కమెడియన్లు హాజరయ్యారు. అతి కొద్ది మంది మిత్రులు, బంధువుల సమక్షంలో ఈ వేడుక జరిగింది.