ఎపిలో సెంచరీ కొట్టిన టమాటా

By udayam on May 21st / 5:21 am IST

ఎపిలో టమాటా ధరలు ఎండల కంటే దారుణంగా మండిపోతున్నాయి. చిత్తూరు జిల్లాలో కేజీ టమాటా ఏకంగా రూ.100 మార్క్​ను దాటేసింది. ఇక్కడి మదనపల్లె రీజియన్​లోని హోల్​ సేల్​ మార్కెట్​లోనే కిలో టమాటా రూ.70–80 పలుకుతుండగా.. బహిరంగ మార్కెట్​లో ఆ ధర రూ.100కు చేరుకుంది. తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోనూ ఇదే రేటు పలుకుతోంది. గత వారం కురిసిన అకాల వర్షాల ధాటికి పంట నష్టం ఏర్పడి దిగుబడి తగ్గిందని.. దీంతో టమాటా రేటు అధికంగా పలుకుతోందని వ్యాపారులు తెలిపారు.

ట్యాగ్స్​