మోర్గాన్​, మెక్​కల్లమ్​లపై కెకెఆర్​ వేటు!

By udayam on June 10th / 9:21 am IST

భారత ఫ్యాన్స్​పై 2018లో జాత్యంహకార ట్వీట్లు చేసినట్లు తేలడంతో ఈసీబీ కెప్టెన్​ మోర్గాన్​, బట్లర్​, మెక్​కల్లమ్​ లపై దర్యాప్తు చేస్తున్న నేపధ్యంలో ఐపిఎల్​లోని షారూక్​ జట్టు కెకెఆర్​ సైతం స్పందించింది. కెకెఆర్​కు మోర్గాన్​ కెప్టెన్​గా, మెక్​కల్లమ్​ కోచ్​గా పనిచేస్తున్నారు. భారతీయులు మాట్లాడే ఇంగ్లీష్​పై వీరంతా ట్విట్టర్లో వ్యంగ్యంగా మాట్లాడుకున్నట్లు స్క్రీన్​షాట్లు వైరల్​ అవుతున్నాయి. దాంతో కెకెఆర్​ సిఈఓ వెంకీ మాట్లాడుతూ వీరిపై కఠిన ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు.