ప్రాక్టీస్​ లో గాయపడ్డ రాహుల్​.. రెండో టెస్ట్​ కు దూరం!

By udayam on December 21st / 10:35 am IST

బంగ్లా పర్యటనలో ఉన్న భారత జట్టుకు గాయాల బెడద ఎక్కువవుతోంది. తాజాగా తాత్కాలిక కెప్టెన్​ కెఎల్​ రాహుల్​ నెట్​ ప్రాక్టీస్​ సెషన్లో గాయపడ్డాడు. దీంతో అతడు రెండో టెస్ట్​ కు అందుబాటులో ఉండే అవకాశాలు తగ్గాయి. రాహుల్​ ఎడమ బొటన వేలికి గాయం అయినట్లు బ్యాటింగ్​ కోచ్​ విక్రమ్​ రాథోర్​ వెల్లడించాడు. అయితే గాయం అంత తీవ్రంగా లేదని కూడా ఆయన పేర్కొన్నాడు. ఒకవేళ రాహుల్​ ఈ మ్యాచ్​ కు దూరమైతే వైస్​ కెప్టెన్​ పుజారా.. రేపటి నుంచి ప్రారంభమయ్యే టెస్ట్​ కు కెప్టెన్​ గా ఉండనున్నాడు.

ట్యాగ్స్​