దంచికొట్టిన రాహుల్​.. చెన్నై చిత్తు

By udayam on October 7th / 6:25 pm IST

పంజాబ్​ కింగ్స్​ ఈ ఐపిఎల్​ను విజయంతో ముగించింది. ఇప్పటికే క్వాలిఫైయర్​ పోటీ నుంచి తప్పుకున్న రాహుల్​ సేన ఆ కోపాన్నంతా చెన్నై జట్టుపై చూపించింది. ముందుగా బ్యాటింగ్​ చేసిన చెన్నైను కేవలం 134 కే పరిమితం చేసిన పంజాబ్​ ఆ తర్వాత బ్యాటింగ్​లోనూ రాణించింది. ముఖ్యంగా కెప్టెన్​ రాహుల్​ 42 బంతుల్లో 98 పరుగులు చేయడంతో పాటు 8 భారీ సిక్సులు కొట్టేశాడు. దీంతో స్వల్ప లక్ష్యాన్ని పంజాబ్​ 13 ఓవర్లలోనే ఛేధించింది. రాహుల్​కు ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డ్​ దక్కింది.