ఆ ఒక్క పరుగే ఫిఫ్టీని ఆపేసింది

By udayam on October 3rd / 6:06 am IST

పరుగుల యంత్రం కింగ్​ కోహ్లీ నిన్న సౌతాఫ్రికాతో జరిగిన టి20 మ్యాచ్​లో 49 పరుగుల వద్దనే నాటౌట్​గా ఉండిపోయాడు. చివరి ఓవర్​లో ఒక్క బంతి కూడా స్ట్రైక్​ రాకపోవడంతో అతడు ఫిఫ్టీని కంప్లీట్​ చేయలేకపోయాడు. అయితే నిజానికి ఇది విరాట్​ తప్పిదమే అని విశ్లేషకులు చెబుతున్నారు. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద 2 పరుగులు కొట్టిన అతడు నాన్​ స్ట్రైకర్​ ఎండ్​లో బ్యాట్​ను క్రీజ్​లోకి పెట్టలేదు. దీంతో 2 రన్స్​ కాకుండా అంపైర్​ ఒక్క పరుగే ఇచ్చాడు. ఆ ఒక్క పరుగే అతడిని 50 పరుగుల మార్క్​ను చేరుకోకుండా ఆపేసింది.

ట్యాగ్స్​