నీట్​లో కోనసీమ విద్యార్థినికి 3వ ర్యాంక్​

By udayam on June 3rd / 11:21 am IST

పీజీ మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్‌ పీజీ ప్రవేశపరీక్షలో కోనసీమ యువతి హర్షిత సత్తా చాటింది. ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి బట్టుపాలెంకి చెందిన యాళ్ల హర్షిత జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్‌ సాధించింది. ఈమెకు పీజీ నీట్​ ఫలితాల్లో 99.17 శాతం మార్కులు వచ్చాయి. భీమనపల్లి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదవిన హర్షిత.. విశాఖలో బైపీసీ పూర్తి చేసింది. ఎంసెట్​లో 180వ ర్యాంకు సాధించిన హర్షిత కాకినాడ రంగరాయ మెడికల్​ కాలేజీలో ఎంబిబిఎస్​ పూర్తి చేసింది.

ట్యాగ్స్​