ఉప్పెన స్టార్ కృతి శెట్టి కంట తడి పెట్టుకుంది. ఓ తమిళ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళిన ఆమెతో యాంకర్లు ప్రాంక్ చేయడమే ఇందుకు కారణం. హీరోయిన్ను ముందు తానంటే తాను ప్రశ్నలు అడుగుతానంటూ యాంకర్లిద్దరూ వాదులాడుకుని, ఆపై పిడుగుద్దులు గుద్దుకోవడంతో అక్కడే ఉన్న నటి ఏడ్చేసింది. అయితే ఆ తర్వాత ఇదంతా ప్రాంక్ అని వారు చెప్పడంతో కాస్త ఊపిరి పీల్చుకున్న ఆమె ఆ తర్వాత నవ్వుతూ ఇంటర్వ్యూను కొనసాగించింది.
Prank goes wrong 🥺😮🤯
The prettiest @IamKrithiShetty
at #TheGalattaCrown2022 👑Watch the full video ▶️ https://t.co/VXFxNaytie#KrithiShetty pic.twitter.com/T5jiGDM55R
— Galatta Media (@galattadotcom) May 27, 2022