టాలీవుడ్లో వన్ నేనొక్కడినేతో ఎంట్రీ ఇచ్చి ఆపై బాలీవుడ్లో సెటిల్ అయిన కృతి సనన్ కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టింది. ఉత్తరాది రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉన్న ఫిట్నెస్ రంగంలోకి తన సరికొత్త వెంచర్ ‘ది ట్రైబ్’ను ఈరోజు లాంచ్ చేసింది. దేశవ్యాప్తంగా ఈ పేరుతో పలు ఫిట్నెస్ స్టూడియోలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. తనతో పాటు అనుష్క నందని, కరన్ సాహ్నీ, రోబిన్ బేల్లు ఈ కంపెనీలకు సహ యజమానులుగా ఉంటారని తెలిపింది.