ఎపి సిఎం జగన్ మోహన్ రెడ్డితోనూ, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుతోనూ తమకు ఎలాంటి విభేదాలు లేవని తెలంగాణ మంత్రి కెటిఆర్ ప్రకటించారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కెటిఆర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎపి ప్రభుత్వంతో మాకు చక్కటి సంబంధాలున్నాయన్న ఆయన విభజన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. చంద్రబాబు నాయుడే ఏదేదో ఊహించుకుని మాకు దూరమయ్యారు తప్ప మేం ఆయన నుంచి స్ఫూర్తి పొందుతూనే ఉంటాం’ అని కేటిఆర్ వివరించారు.