నేటి నుంచి అందుబాటులోకి బన్సీలాల్‌పేట్‌ మెట్లబావి

By udayam on December 5th / 10:01 am IST

హైదరాబాద్‌ లోని బన్సీలాల్‌పేట్‌ మెట్లబావిని మంత్రి కేటీఆర్‌ సోమవారం ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్​ఎంసీ, హెచ్​ఎండీఏ ప్రత్యేక చొరవతో చారిత్రక కట్టడాలను పునరుద్ధరిస్తున్నాయి. ఇందులో భాగంగా బన్సీలాల్‌పేట్‌ లో 3 శతాబ్దాల క్రితం నిర్మించిన నాగన్నకుంట మెట్లబావిని కొత్తగా, అందంగా పునరుద్ధరించారు. ఈ మెట్ల బావి పొడవు 30.5 మీటర్లు, వెడల్పు 19.2 అడుగులు, లోతు 53 అడుగులు ఉంటుంది. ఇవాళ సా.5 గంటలకు మంత్రి కేటీఆర్‌ మెట్లబావిని ప్రారంభిస్తారు.

ట్యాగ్స్​