మంచు మనోజ్ ప్రాజెక్ట్ కి కేటీఆర్ ఒకే

By udayam on January 11th / 6:31 am IST

హైదరాబాద్ : ఈమధ్య రాజకీయ నేతలను సెలబ్రిటీలు తరచూ కలుస్తున్నారు. తాజాగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ను టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌ హైదరాబాద్‌లో కలిశాడు.

ఈ సందర్భంగా తను త్వరలో ప్రారంభించబోయే ఓ ప్రాజెక్టు గురించి మంత్రికి వివరించాడు. ఈ ప్రాజెక్టుకు కేటీఆర్‌ తన మద్దతివ్వడంతో మనోజ్‌ హర్షం వ్యక్తం చేశాడు.

ఇందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనోజ్‌ ట్విటర్‌ ద్వారా షేర్ చేసుకున్నాడు. ‘ఒక పెద్ద, గొప్ప కార్యం మొదలు కానుంది. నా కొత్త ప్రాజెక్టు, స్పోర్ట్స్‌ అండ్‌ ఎడ్యుటైన్‌మెంట్‌ ద్వారా యువతకు, సీనియర్లకు సాయం చేయాలనుకునే ఆలోచనను కేటీఆర్‌ గారితో షేర్‌ చేసుకోవడం ఆనందంగా ఉంది.

దీనికి మీరు మద్దతిస్తున్నందుకు ధన్యవాదాలు. నా కల త్వరలోనే సాకారం కానుంది. వేచి ఉండండి’ అంటూ ట్వీట్‌ చేశాడు.

గత మూడేళ్లుగా సినిమాలకు విరామం ఇచ్చిన మనోజ్‌ త్వరలో ‘అహం బ్రహ్మస్మి’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు.

అహం బ్రహ్మస్మినే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న రెండు సినిమాలను ఒప్పుకున్నాడు మనోజ్​. ఇవి వచ్చే ఏడాది రిలీజ్‌ కానున్నాయి. అయితే మనోజ్‌ ఒక్కసారిగా ఇలా సన్నగా కనిపించడంతో ఓ సినిమా కోసం మనోజ్‌ ఏకంగా 15 కిలోలు సన్నబడ్డాడని టాక్.