జట్టులో ఎవరూ నాతో మాట్లాడరు : కుల్దీప్​

By udayam on September 14th / 12:19 pm IST

కోల్​కత్తా నైట్​ రైడర్స్​ బౌలర్​ కుల్దీప్​ యాదవ్​ ఆ జట్టు యాజమాన్యం, కెప్టెన్ పై నోరుపారేసుకున్నాడు. క్రికెట్​ విశ్లేషకుడు ఆకాష్​ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘అసలు ఈ జట్టులో నా స్థానం ఏంటో ఎవరూ చెప్పరు. నన్ను కొనుగోలు చేసిన కొత్తలో ఒకసారి జట్టు యాజమాన్యం మాట్లాడింది. ఇప్పటి వరకూ నాతో ఎవరూ మాట్లాడలేదు. ఇక విదేశీ కెప్టెన్​ అయిన మోర్గాన్​కు తన ఆట గురించి ఏ మాత్రం అవగాహన ఉండదు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది ఐపిఎల్​ తొలి సీజన్​లో ఒక్క మ్యాచ్​లోనూ అతడు కెకెఆర్​ తరపున బరిలోకి దిగలేదు.

ట్యాగ్స్​