మైదానంలోనే క్రికెటర్​కు గుండెపోటు

By udayam on May 23rd / 10:48 am IST

బంగ్లాదేశ్​తో జరుగుతున్న 2వ టెస్ట్​ తొలిరోజు ఆటలో శ్రీలంక క్రికెటర్​ కుశాల్​ మెండిస్​కు మైదానంలోనే గుండెపోటు వచ్చింది. తొలిరోజు ఆట లంచ్​ సమయానికి ముందు అతడు ఛాతీ నొప్పితో బాధపడుతూ మైదానంలో కూర్చుండిపోయాడు. దీంతో టీం మెడికల్​ సిబ్బంది అతడికి వెంటనే పరీక్షలు జరిపి ఢాకాలోని ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అక్కడి తీవ్రమైన ఎండల ధాటికి డీహైడ్రేషన్​ అవ్వడంతోనే మెండిస్​ కు ఛాతీనొప్పి వచ్చినట్లు శ్రీలంక క్రికెట్​ అసోసియేషన్​ పేర్కొంది.

ట్యాగ్స్​