కుష్భుని అదుపులోకి తీసుకున్న పోలీసులు

By udayam on October 27th / 10:10 am IST

చెన్నై: ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన సినీ నటి కుష్బూను చెన్నైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీసీకే అధినేత తిరుమావళవన్‎ మహిళలను కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుష్బూ నేతృత్వంలోని బీజేపీ నేతలు మంగళవారం నిరసన నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.

అయితే ఈ నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే నిరసన కోసం ఆమె చెన్నై నుండి చిదంబరంకు ప్రయాణిస్తుండగా ముత్తుకాడు సమీపంలో వీరిని అడ్డుకున్నారు. కుష్బూతోపాటు మరికొంత మంది మహిళానేతలు, ఇతరలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తిరుమావళవన్ ఇటీవల యూట్యూబ్ ఛానెల్‌లో మనుస్మృతి, మహిళల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కుష్బూ ఆరోపించారు. ఈ మేరకు ఆయనపై కేసు నమోదు చేశామన్నారు. తన చివరి శ్వాస వరకు మహిళల గౌరవాన్ని కాపాడేందుకు పోరాడతానని కుష్బూ ట్వీట్ చేశారు.