మూవీ రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న ఈ సమయంలో పవన్ కళ్యాణ్ ఆల్ టైం హిట్ ‘ఖుషీ’ ఈనెల 31న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ క్లాసిక్ లవ్ స్టోరీస్ లో ఒకటైన ఈ మూవీ ని పవన్ ఫ్యాన్స్ కోసం ఈనెల 31న ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ న్యూ వెర్షన్ ట్రైలర్ ను విడుదల చేశారు. మణిశర్మ సంగీతం, పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫీ వర్క్, నాజర్, విజయ్ కుమార్, శివాజీ, ఆలీ ల నటన ఈ మూవీలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి.