ట్రైలర్​ : మనసును హత్తుకునే లాల్​ సింగ్​ ఛడ్డా

By udayam on May 30th / 5:58 am IST

అమీర్​ ఖాన్​, నాగ చైతన్య, కరీనా కపూర్​ల మోస్ట్​ అవైటెడ్​ మూవీ లాల్​ సింగ్​ ఛడ్డా ట్రైలర్​ లాంచ్​ అయింది. ఓ సాధారణ పంజాబీ కుటుంబానికి చెందిన యువకుడి అసాధారణ జీవిత కథను ఈ సినిమాలో చూపించనున్నారు. చిన్నప్పుడు కాళ్ళు సరిగా లేని ఓ వ్యక్తి పరుగే జీవితంగా మార్చుకుని ఆపై ఆర్మీ ఆఫీసర్​గా ఎదిగిన క్రమం.. ఆ సమయంలో జీవితంలో ఎదురైన ఎదురుదెబ్బలను ఇందులో చూపించనున్నారు. హాలీవుడ్​ మూవీ ఫారెస్ట్​ గంప్​కు ఇండియన్​ రీమేక్​గా ఇది తెరకెక్కింది.