మనిషికి ల్యాబ్​ లో ఉత్పత్తి చేసిన రక్తం ఎక్కించిన శాస్త్రవేత్తలు

By udayam on November 8th / 6:47 am IST

ప్రపంచంలో తొలిసారి ల్యాబ్‌లో రూపొందించిన రక్తాన్ని మనుషులకు ఎక్కించినట్లు బ్రిటన్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. క్లినికల్ ట్రయిల్స్‌లో భాగంగా కొద్ది మొత్తంలో అంటే సుమారు రెండు స్పూన్ల రక్తాన్ని ఎక్కించారు. ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన రక్తం శరీరంలోకి వెళ్లిన తరువాత ఎలా పని చేస్తుందో పరిశోధకులు గమనిస్తున్నారు. బ్రిటన్‌లోని ఎన్‌హెచ్‌ఎస్ బ్లడ్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్‌కు చెందిన బృందంతోపాటు బ్రిస్టల్, కేంబ్రిడ్జ్, లండన్‌కు చెందిన బృందాలు ఈ ప్రాజెక్ట్ మీద కలిసి పని చేస్తున్నాయి.

ట్యాగ్స్​