అమీర్ మూవీని డామినేట్ చేసిన కార్తికేయ 2

By udayam on August 19th / 5:59 am IST

2014లో వచ్చిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా హిందీ బాక్సాఫీస్‌ ముందు వండర్స్‌ క్రియేట్‌ చేస్తుంది. ఈ మూవీ విడుదలైన థియేటర్స్ వద్ద లాల్ సింగ్ చడ్డ, రక్షా బంధన్ మూవీ కలెక్షన్ లను దాటేసింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన భారీ కలెక్షన్లను రాబట్టుతోంది. చందూ మొండేటి మార్క్‌ దర్శకత్వం, నిఖిల్‌ నటన ఈ సినిమాను విజయతీరాలకు చేర్చింది. అడ్వెంజర్‌ థ్రిల్లర్‌ నేపథ్యంగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తోంది. తొలి రోజు కేవలం 50 స్క్రీన్లతో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఏకంగా 1000 స్క్రీన్స్‌కి చేరుకొని బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ సినిమా బాలీవుడ్‌లో కేవలం ఆరు రోజుల్లో 3000 షోలను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని హీరో నిఖిల్‌ ట్విట్టర్‌ వేదికగా అధికారికంగా ప్రకటించారు.

ట్యాగ్స్​