భారత్​ లోకి లంబోర్గినీ ఉరుస్​ ఎస్‌యూవీ

By udayam on November 25th / 10:33 am IST

ఇటాలియన్‌ సూపర్‌ స్పోర్ట్స్‌ కార్ల తయారీ దిగ్గజం లంబోర్గినీ తాజాగా భారత్‌లో ఊరూస్‌ పెర్ఫార్మెంటే ఎస్‌యూవీని పరిచయం చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.4.22 కోట్లు (ఎక్స్​ షో రూం) గా ఉండనుంది. స్టాండర్డ్​ ఎస్‌యూవీ కార్ల కంటే దీని ధర రూ.1.12 కోట్లు ఎక్కువగా ఉంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 3.3 సెకన్లలోనే చేరుకోవడం దీని ప్రత్యేకత. గరిష్ట వేగం గంటకు 306 కిలోమీటర్లు. భారత్‌లో బ్రాండ్‌ వృద్ధిని పెంచడంలో, కొత్త మార్కెట్లను తెరవడంలో ఊరూస్‌ కీలకపాత్ర పోషించిందని లంబోర్గినీ ఇండియా హెడ్‌ అగర్వాల్‌ తెలిపారు.

ట్యాగ్స్​