భారత కోచ్​ రేస్​లో క్లూజ్​నర్​

By udayam on October 12th / 10:47 am IST

టి20 వరల్డ్​కప్​ తర్వాత రవిశాస్త్రి తన భారత కోచ్​ పదవికి రాజీనామా చేస్తానన్న వ్యాఖ్యల నేపధ్యంలో బిసిసిఐ కొత్త కోచ్​ కోసం వేట మొదలెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే మహేళ జయవర్దనే, అనిల్​ కుంబ్లే, రాహుల్​ ద్రవిడ్​ల పేర్లు వినిపిస్తుండగా తాజాగా సౌత్​ ఆఫ్రికా మాజీ స్టార్​ ఆల్​రౌండర్​ లాన్స్​ క్లూజ్​నర్​ పేరు కూడా వినిపిస్తోంది. దీనిపై అతడు కూడా స్పందించాడు. ‘భారత్​ లాంటి దిగ్గజ జట్టుకు కోచ్​ పదవి వస్తే కాదనగలమా? నా సహచర ఆటగాళ్ళు గేరీ క్రిస్టెన్​, పాడీ అప్టన్​లు కూడా ఆ పదవిలో సక్సెస్​ అయ్యారు. చూద్దాం ఏమవుద్దో. ప్రస్తుతం ఆఫ్ఘన్​ కోచ్​గా నాకు చాలా బాగుంది. భారత్​కు కోచ్​ అయితే సంతోషమే’ అంటూ పేర్కొన్నాడు.

ట్యాగ్స్​