శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఏరికోరి తెచ్చుకున్న ప్రధాని రణిల్ విక్రమ్ సింగే షాక్ ఇచ్చారు. ఆ దేశ ప్రజలు రాజపక్స కుటుంబాలకు వ్యతిరేకంగా జరుపుతున్న నిరసనలకు విక్రమ్ మద్దతు ఇచ్చారు. ‘గొట గో హోమ్’ నిరసనకారుల డిమాండ్ల పరిశీలనకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ‘దేశ యువత నిరసనల్లో న్యాయం కనిపిస్తోంది.. రాజపక్స కుటుంబీకులు ఇళ్ళకు వెళ్ళడమే మంచిది.. భవిష్యత్తు విధాన రూపకల్పన కోసం కమిటీ వేస్తుననాం’ అని విక్రమ్ ప్రకటించారు.